Sunday, 1 September 2013

ఉన్నత చదువులు.. ప్రైవేటు కొలువులు..


యువకులు విదేశాల్లోను, ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు రంగంలో వేతనాలు తక్కవగా ఇస్తుండడంతో బీటెక్‌ చేసిన యువకులు విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.అత్యధికులు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.నాలుగు గ్రామాల్లో 94 మంది బీఈడీ చదువుకున్నారు.
గత పదేళ్లలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు(డీఎస్సీ) ఐదు మార్లు నిర్వహించడంతో 36 మంది యువకులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. సర్వే చేసిన 275మందిలో 48 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికవ్వగా అందులో 36 మంది ఉపాధ్యాయులే ఉండడం విశేషం. బీఈడీ పూర్తి చేసిన వారిలో 46 మంది ప్రైవేటు పాఠశాలల్లో బోధిస్తూ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.పీజీకి నిరాదరణ కనిపిస్తోంది. సర్వే చేసిన నాలుగు గ్రామాల్లో పీజీ పూర్తి చేసిన వారు 89 మంది ఉండగా అందులో కేవలం 09 మందికే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. 34 మంది ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరో 46 మంది యువత చదువుతో సంబంధం లేని ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. పీజీకి ఉద్యోగావకాలు తగ్గిపోతుండడంతో యువత ఆలోచన ధోరణి మారుతోంది.నా పేరు అత్తెలి శ్రీనివాస్‌. జంగంపల్లి గ్రామం. ఎంబీఏ వరకు చదువుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు రావడం లేదు. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తే నెలకు రూ.10 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదు. అందుకే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ నెలకు రూ.15వేలు సంపాదిస్తున్నా.'నా పేరు బంధం ప్రవీణ్‌కుమార్‌. రాజంపేట గ్రామం. ఎంఏ, ఎంఫిల్‌ వరకు చదివాను. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు రాకపోవడంతో ప్రైవేటు అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తున్నాను. నెలకు రూ.16 వేల వేతనం అందుతోంది.నాపేరు బాలగోని బాబాగౌడ్‌. పెద్దమల్లారెడ్డి గ్రామం. బీపీఈడీ చేశాను. ప్రభత్వం వ్యాయామ విద్యను ప్రోత్సహించడం లేదు. డీఎస్సీలోపీఈటీల పోస్టులను భర్తీ అసలే చేయడం లేదు. దీంతో మాలాంటి యువకులకు అసలే అవకాశాలు రావడం లేదు. అందుకే ఒప్పంద ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నెలకు రూ.11 వేల వేతనం ఇస్తున్నారు.'
Source:EENADU

No comments:

Post a Comment

Popular Posts