శుక్రవారం...
సమయం సాయంత్రం ఏడుగంటల నలభై ఐదు నిమిషాలు. బెంగళూరులోని ప్రముఖ
సాఫ్ట్‌వేర్ కంపెనీ. శ్రీధర్ పనిలో బిజీగా ఉన్నాడు. అప్పుడే ఆయన మొబైల్
రింగైంది. చూస్తే స్నేహితుడు శరత్. శనివారం ఉదయం తన పెళ్లి అని తప్పకుండా
రావాలన్నది సారాంశం. వెంటనే తన స్మార్ట్‌ఫోన్‌తో తనకు తెలిసిన ట్రావెల్స్
నుండి టికెట్ బుకింగ్ చేసుకున్నాడు. తొమ్మిది గంటలకు ఆఫీసు ముగించుకుని
బస్సు ఏ రూట్‌లో వెళుతుందో కనుక్కుని నిదానంగా డిన్నర్ ముగించుకుని
9.45కల్లా బస్సులో ఉన్నాడు.
ఇది
బస్సు టికెట్ బుకింగ్‌లో వచ్చిన విప్లవం. ఈ విప్లవం వెనుక ఒక యువకుని కృషి
వుంది. అతని ఇద్దరు స్నేహితుల సహాకారం ఉంది. అతనే ఫణింధ్ర సామ. విమనాలు,
రైల్లో మాదిరిగానే బస్సుల్లోనూ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానానికి
శ్రీకారం చుట్టాడాయన. 2006లో కేవలం పది టికెట్ల బుకింగ్‌తో ప్రారంభమైన ఈ
విప్లవం నేడు రూ. 15,000 కోట్ల మార్కెట్ షేర్‌తో సాగుతుందంటే
అతిశయోక్తికాదు.
ఆన్‌లైన్ వ్యాపారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఫణింవూధది నిజామాబాద్.
అంటే మన తెలంగాణ బిడ్డ. బస్సు టికెట్ కూడా ఆన్‌లైన్ ద్వారా బుక్
చేసుకోవచ్చన్న ఆలోచన తనకి ఎలా వచ్చిందంటే ఒక ఆసక్తికర అంశాన్ని
వెల్లడించాడు ఫణింధ్ర. దీపావళీ పండుగ రోజులు. బెంగళూరులోని టెక్సాస్
ఇన్స్‌వూటూమెంట్స్‌లో తాను సీనియర్ డిజైనర్‌గా జాబ్ చేస్తున్నాడు.
అర్జంటుగా హైదరాబాద్‌కు రావాలనుకున్నాడు. రైలు టిక్కెట్ల కోసం
ప్రయత్నించాడు, కానీ దొరకలేదు. ఏదో ఒక బస్సు టికెట్ దొరక్కపోతుందా
అనుకున్నాడు. తనకు తెలిసిన కొన్ని టూర్ ఆపరేటర్ల అడ్రసులు, బస్సుల వివరాల
ద్వారా ప్రయత్నించినప్పటికీ టికెట్ మాత్రం దొరకలేదు. చేసేదిలేక మరునాటికి
ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. కానీ, అప్పటికే తన మదిలో ఒక సందేహం పురుగులా
తొలుస్తోంది. అది రైళ్ళు, విమానాలకు ఉన్నట్లు బస్సు సీట్ల బుకింగ్ కోసం
ఆన్‌లైన్ పోర్టర్లు ఎందుకు లేవూ అని! ఆ సందేహం నుంచి పుట్టిన ఆలోచనే బస్సు
టికెట్ల ఆన్‌లైన్ వ్యాపారానికి పునాది వేసింది. తనతో కలసి చదివిన
స్నేహితులు కరీంనగర్‌కు చెందిన సుధాకర్, కడపకు చెందిన పద్మరాజులతో కలిసి ఒక
వినూత్నమైన వ్యాపారానికి మార్గం వేసింది.
అత్యవసరంగా ఊరేళ్లాలనుకునేవారికి, చాంతాడంతా లైన్లలో నిలబడి టికెట్లు
బుకింగ్ చేసుకునే తీరిక లేనివారికి, సరైన ట్రావెల్స్ ఆడ్రాస్ తెలియనివారికి
ఆన్‌లైన్ ద్వారా తాము వెళ్లాల్చిన రూట్లకు బస్‌టికెట్‌ను బుక్
చేసుకోవడానికి ఈ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడటం మొదలైంది. వాస్తవానికి ఇదంతా
2006 ఆగస్టు నాటి ముచ్చట. అప్పటిదాకా ఆన్‌లైన్‌లో ప్రైవేటు బస్సులా
వివరాలుంచే వ్యవస్థ అందుబాటులో లేదు. ఇది వీరికి మరింత కలసి వచ్చింది.
వెంటనే పలు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలతో చర్చించారు. ఆన్‌లైన్ ఆయా
బస్సుల వివరాలు ఉంచడం వల్ల వారికి ప్రచారం లభించడంతో పాటు సీట్లు తొందరగా
నిండే అవకాశం ఉండడంతో ఆయా యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. దీనికోసం ఆన్‌లైన్
బుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు డోర్‌డెలివరీ సౌకర్యం, ప్రధాన
నగరాల్లో బుకింగ్ ఫాయింట్లను కూడా వారే ఏర్పాటు చేశారు. మొదట్లో కేవలం పది
టికెట్లు మాత్రమే బుక్ అయ్యేవి. ప్రకటనల ద్వారా కొంతమొత్తం వచ్చేది. అయితే
ఆన్‌లైన్ మీదా అవగాహన పెరిగినకొద్ది వినియోగం కూడా పెరిగింది. దీంతో
ముగ్గురు మిత్రులు కూడా అప్పటి వరకు లక్షకు తక్కువ కాకుండా జీతం వచ్చే
ఉద్యోగం మానేసి పూర్తి సమయం పోర్టర్ నిర్వహణకే కేటాయించారు.
అప్పట్లో అంటే ఏడేళ్లక్షికితం ట్రావెల్ ఆపరేటర్లు, ఎజెంట్లు 30 పేజీలున్న
బుక్ పట్టుకుని కూర్చునేవారు. నెలలో ఒక్కోపేజీ ఒకరోజుకు కేటాయించేవారు.
టికెట్ కావాలని ఏజేంట్లను సంప్రదిస్తే వారు ఆపరేటర్లకు ఫోన్‌చేసేవారు.
ఆపరేటర్లు సీట్లు ఉన్నాయా లేవా అని వారి బుక్‌లో చెక్ చేసుకునేవారు.
ఆపరేటర్ ఆపీసులో వరుసగ బేంచీలుండేవి. పనిచేసేవారు వరుసగా కూర్చునేవారు.
ఒక్కొరి దగ్గర ఒక బుక్ ఉండేది. ఆయా బస్‌లకు సంబంధించి బుకింగ్ కాల్ వస్తే
వారి బస్‌లో సీట్లు ఉన్నాయో లేవో చెప్పాల్సి వచ్చేది. ఒక్కోక్కసారి
పొరపాటుగా ఒకే సీటును ఇద్దరికీ కేటాయించేవారు. అది గొడవలకు దారితీసేది.
కానీ, ఇప్పుడు అంతా కంప్యూటర్లమీదే పని నడుస్తోంది. బెంగళూరులో ప్రారంభమైన
రెడ్‌బస్ ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, పుణే, ముంబై, ఢిల్లీ, ఆహ్మదబాద్‌లకు
విస్తరించింది. ఒకప్పుడు సోంతంగా బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసిన రెడ్‌బస్
ప్రస్తుతం షాపింగ్‌మాల్స్, కేఫ్‌లు, ఈ-సేవా కేంద్రాల ద్వారా కూడా
టికెట్లను విక్రయిస్తున్నారు.
www.redbus.in సక్సెస్ స్టోరీ
- జులై 2012 నాటికి రెడ్‌బస్ టికెట్ల విక్రయంలో ఒక నూతన అధ్యయనానికి
తెరలేపింది.
- ప్రారంభించిన ఏడు సంవత్సరాల్లోనే కోటి ఆన్‌లైన్ టికెట్లు అమ్మి చరిత్ర
సృష్టించింది. అంతేకాదు రెండు కోట్ల మంది వినియోగదారులుగా రిజిష్టర్
చేసుకున్నారు. 200 మిలియన్ డాలర్ల వ్యాపార భాగస్వామ్యాన్ని సొంతం
చేసుకుంది.
- ప్రస్తుతం రెడ్‌బస్ 250 పైగా బస్ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు
3600 రూట్లలో బుకింగ్ సదుపాయం, దేశంలోని ఏడు నగరాల్లో సేవలు అందిస్తుంది.
మకెడిట్, డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందే అవకాశం
ఉంది. ఎస్సెమ్మెస్‌తోనూ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉండడంతో పాటు నగరంలో ఏ మూల
ఉన్న రూ.20 తో డోర్ డెలివరీ చేసే సహాకారం కూడా ఉంది.
Source:Namasthe Telaangana(Bathukamma)
No comments:
Post a Comment